SDPT: జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కుక్కునూరుపల్లిలో జనగణన, బడిబాట కార్యక్రమాలపై అవగాహన కళా ప్రదర్శన నిర్వహించారు. కళాకారులు ఆటపాటల ద్వారా ప్రజలకు సందేశాలు అందించారు. జనగణనలో ఎన్యుమరేటర్లకు సహకరించి కుటుంబ వివరాలు నమోదు చేయించాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని అవగాహన కల్పించారు.