RR: నందిగామ మండల కేంద్రంలోని 1వ అంగన్వాడీ కేంద్రంలో శ్రామిక తల్లుల పిల్లల (7 నెలల – 3 ఏళ్లు) సంరక్షణ కోసం నూతనంగా ‘క్రేచే’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎస్బీఐ, మొబైల్ క్రేచెస్, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా దీనిని నిర్మించాయి. ఉదయ్ (CDPO), సర్పంచ్ కొమ్ము కృష్ణ ఈ అవగాహన సదస్సులో పాల్గొని, ఈ కేంద్రం ద్వారా పేద మహిళల ఆర్థిక సాధికారత మెరుగవుతుందని తెలిపారు.