NLG: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్ హెచ్చరించారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో గురువారం సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న నరసింహతో ఆయన పర్యటించి, షాపుల వద్ద చెత్త వేయరాదని యజమానులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామన్నారు.