KNR: మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి అంగన్వాడీ కేంద్రంలో జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలపై అవగాహన కల్పించారు.