NLR: గుడ్లూరు మండలం బసిరెడ్డిపాలెం జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బహుమతులు అందజేశారు. మామిడాల ప్రేమ్ కుమార్, దీక్షితా రెడ్డిలను సత్కరించారు. గణిత ఉపాధ్యాయుడు మార్తాటి జనార్ధన్ ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందించగా… ఎమ్మెల్యే ఆయన సేవలను అభినందించారు.