MHBD: మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గంగారం మండలం మర్రిగూడెంలో మాజీ MPP సువర్ణపాక సరోజన-జగ్గారావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆమె కొనియాడారు.