AP: ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో గెలిచి విజయ్ సీఎం అయిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో విజయ్.. మాజీ సీఎం జగన్ ఫొటోను వినియోగించడంపై తాజాగా జగన్ స్పందిస్తూ.. ‘ఆయన రాష్ట్రంలో ఆయనకే ఎక్కువ పలుకుబడి ఉంటుంది. నాకు ఎలా ఉంటుంది’ అని అన్నారు. విజయ్ జగన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం మాత్రం ఉంది.