MDK: జిల్లా సంస్కృతి, కళలకు నిలయమని అదనపు కలెక్టర్ నగేష్ ఇవాళ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో యువజన కేంద్రాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. భవిష్యత్తులో స్థానిక కళలకు మరింత గుర్తింపు తెస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు రమేష్, ప్రకాష్ రావు పాల్గొన్నారు.