WNP: ఫోక్స్ కేసుల బాధితులకు ఒకే చోట న్యాయ సహాయం, మానసిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018లో భరోసా కేంద్రాలను ప్రారంభించిందని జోగులాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహన్ అన్నారు. గురువారం నూతన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ.. వారికి అవసరమైన సహాయం అందించడం భరోసా కేంద్రాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.