ATP: ఏపీ హైకోర్టులో వివిధ పోస్టుల భర్తీకి మే 23-25 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనుంది. అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లోని మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయని ఇన్ఛార్జ్ ప్రధాన జిల్లా జడ్జి తెలిపారు. అభ్యర్థులు మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఆన్లైన్ పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయని అన్నారు.