AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది. సమావేశంలో తీర్మానాలపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం క్లస్టర్ స్థాయిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.