KMR: మద్నూర్ మండల పరిధిలోని వైన్ షాప్స్ యాజమాన్యం ఎక్సైజ్ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా గ్రామాలకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఒక వ్యక్తికి 1 నుంచి 3 బాటిల్స్ మాత్రమే ఇవ్వాలనే నిబంధనను వారు పూర్తిగా గాలికి వదిలేశారు. గ్రామాలలో బెల్ట్ షాపులను నిర్వహించే వారికి వీరు అడ్డూ అదుపూ లేకుండా మాకు డబ్బులొస్తే చాలు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.