ప్రకాశం: ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గురువారం ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు యోగ, మెడిటేషన్ ప్రాముఖ్యతను వివరించి రక్తపోటుని నియంత్రణలో ఉంచుకోవాలంటే రోజు తగిన వ్యాయామం చేయాలన్నారు. ఎస్పీ ఆదేశాలతో గత రెండు రోజులుగా రక్తపోటుపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.