• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

గ్యాస్ లారీ బోల్తా.. భయాందోళనలో స్థానికులు

AP: పార్వతీపురం పి.కోనవలస చెక్‌పోస్ట్ దగ్గర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి గ్యాస్ లారీ బోల్తా పడింది. దీంతో లారీ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్ధానికులు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

April 18, 2026 / 10:36 PM IST

పోలాండ్‌లో మృతి చెందిన విశాఖ వాసి

AP: పోలండ్‌లో మృతి చెందిన విశాఖ జిల్లా వాసి ప్రసాద్‌బాబు(45) మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాన్ని వార్సా నుంచి తుర్కియేలోని ఇస్తాంబుల్ మీదుగా ఆదివారం రాత్రికి HYDకి చేరుకొనుంది. అక్కడి నుంచి విశాఖకు తరలించేందుకు ‘ఓపస్’ ఫ్యునరల్ సర్వీసెస్ సంస్థ కుటుంబ సభ్యులతో కలిసి సమన్వయం చేస్తోంది. కాగా, అనారోగ్యంతో అతడు ఈ నెల 4న మృతి చెందాడు.

April 18, 2026 / 09:10 PM IST

విషాదం.. రిటైర్డ్ ప్రిన్సిపాల్ సజీవదహనం

TG: హైదరాబాద్‌ బేగంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పూజ చేస్తుండగా దీపం చీరకు అంటుకుని రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి సజీవదహనమయ్యారు. సోఫా, కర్టెన్‌లకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఆమె అప్పటికే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 18, 2026 / 10:25 AM IST

దారుణం.. అక్రమ సంబంధం కోసం బాలుడి హత్య

TG: కామారెడ్డి జిల్లా కేంద్రం శ్రీరామ్ నగర్ కాలనీలోదారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వ్యక్తి శ్రవణ్(5) అనే చిన్నారిని హత్యచేశాడు. బాలుడి తల్లి లక్ష్మి భర్తతో విడిపోయి నర్సింహులు అనే వ్యక్తితో సహజీవనంలో ఉంది. ఈ క్రమంలో రాత్రి లక్ష్మి లేనప్పుడు ఆమె ఇంటికి వెళ్లిన నర్సింహులు.. శ్రవణ్ గొంతు నులిమి హత్య చేశాడు. అతనితో పాటు లక్ష్మినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

April 18, 2026 / 06:22 AM IST

BREAKING: ట్రావెల్స్ బస్సులో మంటలు

TG: హైదరాబాద్‌లోని KPHB ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు నుంచి దింపేశారు. తగలబడుతున్న బస్సులో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో KPHBలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

April 17, 2026 / 11:06 PM IST

BREAKING: ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోయంబత్తూర్ జిల్లా పాల్‌పారైలో వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా కేరళకు చెందినవారిగా గుర్తించారు.

April 17, 2026 / 07:20 PM IST

ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ATP: తాడిపత్రి మండలంలోని వీరాపురంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాన్ని డ్రోన్ కెమెరా సాయంతో పోలీసులు గుర్తించారు. సీఐ శివగంగాధర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.70,150 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

April 17, 2026 / 05:50 PM IST

తెనాలిలో అర్థనగ్న ఫోన్‌కాల్స్ కలకలం

AP: గుంటూరు జిల్లా తెనాలిలో అర్థనగ్న ఫోన్‌కాల్స్, చాటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్ట్రిప్ టాక్ పేరుతో ఓ యువకుడు ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహిస్తున్నాడు. డబ్బులు చెల్లించిన వారితో మహిళలు న్యూడ్ చాటింగ్ చేస్తున్నారు. చెంచుపేటలో ఓ ఇంటి నుంచి వ్యవహారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో పోర్టల్ నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

April 17, 2026 / 03:19 PM IST

థాయ్‌లాండ్ పండుగలో విషాదం: 191 మంది మృతి

థాయ్‌లాండ్‌లో వారం రోజులపాటు జరుపుకునే సోంగ్‌క్రాన్ వేడుకల్లో 191 మంది మరణించడం తీవ్ర విషాదం నింపింది. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల 951కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ప్రయాణాల రద్దీ వల్ల ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పండుగ సంతోషం నింపాల్సింది పోయి, ఇలా మారణహోమంగా మారడం కలచివేస్తోంది.

April 17, 2026 / 01:31 PM IST

కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

ఇండోనేషియా వెస్ట్ కాళీమంతన్ ప్రావిన్స్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఎనిమిది మంది మృతిచెందారు. మెలావి జిల్లాలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ అయింది. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

April 17, 2026 / 09:23 AM IST

అనకాపల్లిలో భుప్రకంపనలు

AP: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి వేళ భూప్రకంపనలు సంభవించాయి. రాంబిల్లి పరిసరాల్లో రా.12 గంటల తర్వాత కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.

April 17, 2026 / 08:24 AM IST

దారుణం.. అనుమానంతో కాలు నరికేశాడు!

AP: పల్నాడు జిల్లా తొండపిలో అనుమానంతో ఓ వ్యక్తి కిరాతకానికి ఒడిగట్టాడు. తన భార్య భూలక్ష్మిపై అనుమానంతో భర్త లక్ష్మయ్య గొడ్డలితో దాడి చేసి, ఆమె కాలును నరికేశాడు. అనంతరం తెగిపడిన కాలును సంచిలో వేసుకుని నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన భూలక్ష్మిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 16, 2026 / 11:57 AM IST

అమానవీయం.. బాలుడితో యాసిడ్ తాగించిన పిన్ని

TG: తన కొడుకును‌ ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారని ఓ మహిళ తోడి కోడలి కుమారుడి(4)పై దారుణానికి ఒడిగట్టింది. జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి యాసిడ్ తాగించింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 16, 2026 / 11:44 AM IST

భూవివాదం.. కత్తితో గొంతు కోశారు!

AP: తిరుపతి గ్రామీణ(M) అడపారెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భూవివాదంతో అమర్నాథ్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో గొంతు కోసి చంపేశారు. అదే గ్రామానికి చెందిన బొమ్మ రాహుల్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్ రెడ్డి కుటుంబసభ్యులతో పరారు కావడంతో ఆయన బైకుకు మృతుడి బంధువులు నిప్పుపెట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

April 16, 2026 / 09:15 AM IST

కర్నూలు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

AP: కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలు, బాలిక, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా కర్ణాటకలోకి చిక్ మంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.

April 16, 2026 / 06:31 AM IST