AP: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి వేళ భూప్రకంపనలు సంభవించాయి. రాంబిల్లి పరిసరాల్లో రా.12 గంటల తర్వాత కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.