• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలోని సిన్సినాటిలో ఒక మ్యూజిక్ ఈవెంట్‌లో కాల్పులు జరిగాయి. రివర్ఫ్రంట్ లైవ్ వేదిక వద్ద దుండగులు జరిపిన ఈ దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

March 1, 2026 / 02:28 PM IST

ఈ-సిగరెట్ల కలకలం 

TG: మహబూబ్‌నగర్‌లో ఈ-సిగరెట్లు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోనే ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 10:21 AM IST

కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా అరెస్ట్

TG: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్పల్లిలో ఎస్‌కే రాయల్ ఎంటర్‌ప్రైజెస్, షాహీ గోల్డ్ కంపెనీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అబ్దుల్ సత్తార్ సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 10:13 AM IST

BREAKING: మరో పేలుడు.. 15 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్‌లోని బాణాసంచా గోడౌన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 10:00 AM IST

600 ఎకరాల్లో హార్సిలీహిల్స్‌ అడవి దగ్ధం

AP: అన్నమయ్య జిల్లా బి.కొత్తపేట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పరిధిలోని అడవుల్లో మంటలు వ్యాపించాయి. సెరికల్చర్ ఫాం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నిన్న నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. రాత్రి వరకు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ఈ మంటల్లో కొన్ని జంతువులు కాలిపోతున్నాయని వెల్లడించారు. ఫాం వద్ద మంటలు ఆర్పివేశామని అటవిశాఖ అధికారి చెప్పారు.

March 1, 2026 / 07:59 AM IST

సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్

TG: HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 8 సైబర్ మోసాల కేసుల్లో 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 117 కేసుల్లో బాధితులకు 564 రిఫండ్ ఆర్డర్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రూ.1.62 కోట్లకు పైగా రిఫండ్ ప్రక్రియ కొనసాగింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుణెలో కీలక నిందితుడు అర్జున్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

February 28, 2026 / 09:32 PM IST

పేలుడు ఘటన.. 11 మృతదేహాలు గుర్తింపు

AP: కాకినాడ జిల్లా పేలుడు ఘటనలో ఇప్పటివరకు 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేష్, గొడతా రాము, గొడతా నానిగా గుర్తించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిమితికి మించి బాణాసంచా తయారుచేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

February 28, 2026 / 04:29 PM IST

పేలుడు ఘటన.. భారీగా పెరిగిన మృతులు

AP: కాాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవదహనం అయ్యారు. అయితే, ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అక్కడ పరిస్థితి హృదయవిదారకంగా మారింది.

February 28, 2026 / 03:44 PM IST

BREAKING: పేలుడు ఘటనలో ఆరుగురు మృతి

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలో భారీ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అయితే, ప్రమాద సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. బాణాసంచా తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం వల్ల చట్టుపక్కల ప్రాంతాల్లో మంటలు అంటుకుని ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

February 28, 2026 / 03:16 PM IST

BREAKING: భారీ పేలుడు

AP: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల్లో 20 కార్మికులు చిక్కుకున్నట్లు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 02:48 PM IST

పరిగి చెరువులో పడి వ్యక్తి మృతి

సత్యసాయి: పరిగి మండలం స్థానిక చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. శనివారం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఇతర కారణాలున్నాయా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 12:40 PM IST

నిద్రమత్తులో ప్రమాదం.. వ్యక్తి మృతి

E.G: దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారిపై  శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాతబగ్గానికి చెందిన కొందరు గుడివాడ మినప చేలు తీత కోసం వెళుతుండగా లారీ పైనుంచి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిందపడే సమయంలో సదరు వ్యక్తి నిద్ర మత్తులో ఉన్నట్లు సమాచారం.

February 28, 2026 / 10:00 AM IST

గుర్తు తెలియని వాహనం ఢీ.. రిటైర్డ్ టీచర్ మృతి

TG: ఆర్మూరులోని మామిడిపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్ టీచర్ నాగులపల్లి గంగారం (68) చనిపోయాడు. ఎలక్ట్రిక్ స్కూటీపై ఆయన వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను అక్కడ ఉన్న వ్యక్తులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గంగారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 28, 2026 / 09:51 AM IST

రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి

KKD: తుని మండలం చేపూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం NH-16 రోడ్డుపై డివైడర్ మధ్యలో గుర్తుతెలియని (55) వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై చేపూరు వీఆర్ రుత్తల అనిత ఫిర్యాదు చేయగా, తుని రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 28, 2026 / 06:04 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 13 మందికి జైలు శిక్ష

కాకినాడ ట్రాఫిక్ 1,2 పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి 41 మంది మద్యం తాగినట్లు గుర్తించామని ట్రాఫిక్ వన్ సీఐ నూని రమేష్ తెలిపారు. వీరిని శుక్రవారం కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వీరిలో 13 మందికి రెండు నుంచి ఐదు రోజుల జైలుశిక్ష, 28 మందికి రూ.10వేల వంతున జరిమానా విధించారని సీఐ తెలిపారు.

February 28, 2026 / 05:30 AM IST