మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. ముర్బాద్ సమీపంలోని గోవిలి గ్రామం వద్ద ఉన్న రైతా వంతెనపై ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను సిమెంట్ మిక్సర్ బలంగా ఢీకొట్టిడంతో 11 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.