ATP: శింగనమల మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. బ్యాంకులో ఉన్న ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బ్యాంకుకు వచ్చిన ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అయితే, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది మంటలను అదుపు చేశారు.
AP: విశాఖలో అనుమానాస్పద స్థితిలో GVMC ఉద్యోగి గౌరీనాయుడు మృతి చెందారు. ఆరిలోవలో గౌరీనాయుడు కుటుంబ సభ్యులు నివాసిస్తున్నారు. భార్యతో కాకుండా ఈనెల 12 నుంచి సహచర ఉద్యోగిని ఇంట్లో ఆయన ఉంటున్నారు. అయితే ఫోన్ చేసినా రాకపోవడంతో గౌరీనాయుడు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సహచర ఉద్యోగిని ఇంటికి వెళ్లగా ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం కనిపించింది.
TG: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీషీటర్ హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో డబ్బుల కోసం ఇద్దరిని బెదిరించాడు. వారితో డబ్బులు లేవని చెప్పడంతో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఉజ్జయిన్ జిల్లాలో క్వారీలో స్నానం చేస్తుండగా 9 మంది గల్లంతయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు ఏడుగురిని రక్షించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్‌లోని మీర్‌చౌక్‌లో దారుణం జరిగింది. అన్న, వదినను తమ్ముడు నరికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో దారుణం జరిగింది. కాట్నపల్లిలో మూడేళ్ల చిన్నారిని వీధికుక్కలు పీక్కుతిన్నాయి. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు ఆడుకుంటున్న దివ్యా బెహ్రాపై కుక్కలు దాడి చేశాయి. చిన్నారిని కుక్కలు నోటకరుచుకుని పొలాల్లోకి లాక్కెళ్లాయి. ఒడిశా నుంచి వచ్చి ఇటుకబట్టీల్లో చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తున్నారు.
AP: విశాఖ జిల్లా గాజువాకలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, భవనం పైకి ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
AP: విజయనగరం జిల్లాలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. మట్టి పెకిలించే సమయంలో నాటు బాంబు పేలింది. దీంతో బాంబులోని గాజుపెంకులు గుచ్చుకుని ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెందుర్తిలోని సీహెచ్‌సీకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: ఈవీఎం గోదాము వద్ద హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కాకినాడలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ ధనరాజు రైఫిల్‌తో కాల్చుకున్నాడు. ఈవీఎంల వద్ద విధుల్లో ఉండగానే రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ధనరాజును సిబ్బంది కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ధనరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
AP: సెల్ ఫోన్ చూడొద్దని మందలించారని యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజంపేటలో జరిగింది. సుమిత్ర(18) అనే యువతి అక్క, బావతో కలిసి నివాసం ఉంటోంది. యువతి ఎప్పుడూ ఫోన్ చూస్తుండటంతో అక్కా బావ మందలించారు. సెల్ ఫోన్ కూడా పగులగొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని TNGO కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా భవనం సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. భవనం పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో భవనవాసులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.
దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను HYD పోలీసులు ఛేదించారు. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, 32 మంది బ్యాంకు అధికారులతో సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. పెట్టుబడి స్కామ్‌లు, డిజిటల్ అరెస్టుల పేరిట.. నేరస్థులతో కుమ్మక్కైన బ్యాంక్ అధికారులు.. వారికి ఖాతాలు తెరచి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
TG: మేడ్చల్ జిల్లా డబిల్‌పూర్ గ్రామంలో విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి వెళ్లి ఉమన్(14), ఇర్ఫాన్(12) అనే ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వీరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. మృతులు 9వ, 7వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP: తెనాలిలో న్యూడ్ కాల్స్, చాటింగ్ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహణపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. న్యూడ్‌కాల్స్ పోర్టల్‌లో బంధువులైన ఇద్దరు మహిళలు తప్ప ఎవరూ లేరని నిర్వాహకుడు పోలీసులకు తెలిపాడు. కాగా, స్ట్రిప్ టాక్ పేరుతో డబ్బులు చెల్లించిన వారితో మహిళలు న్యూడ్ చాటింగ్ చేస్తున్నారు.
ఇటలీలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బెర్గామో ప్రావిన్స్‌లోని కోవో పట్టణంలో ఈ ఘటన జరిగింది. వైశాఖీ పండగ నేపథ్యంలో గురుద్వారాకు వెళ్లి తిరిగి బయటకు వస్తుండగా కాల్పులు జరిగినట్లు సమాచారం. మృతులను రాజిందర్ సింగ్ (48), గుర్మీత్ సింగ్ (48)గా గుర్తించారు. కాల్పుల అనంతరం దుండగులు కారులో పారిపోయారు.