• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

ఇండోనేషియా వెస్ట్ కాళీమంతన్ ప్రావిన్స్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఎనిమిది మంది మృతిచెందారు. మెలావి జిల్లాలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ అయింది. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

April 17, 2026 / 09:23 AM IST

అనకాపల్లిలో భుప్రకంపనలు

AP: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి వేళ భూప్రకంపనలు సంభవించాయి. రాంబిల్లి పరిసరాల్లో రా.12 గంటల తర్వాత కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.

April 17, 2026 / 08:24 AM IST

దారుణం.. అనుమానంతో కాలు నరికేశాడు!

AP: పల్నాడు జిల్లా తొండపిలో అనుమానంతో ఓ వ్యక్తి కిరాతకానికి ఒడిగట్టాడు. తన భార్య భూలక్ష్మిపై అనుమానంతో భర్త లక్ష్మయ్య గొడ్డలితో దాడి చేసి, ఆమె కాలును నరికేశాడు. అనంతరం తెగిపడిన కాలును సంచిలో వేసుకుని నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన భూలక్ష్మిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 16, 2026 / 11:57 AM IST

అమానవీయం.. బాలుడితో యాసిడ్ తాగించిన పిన్ని

TG: తన కొడుకును‌ ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారని ఓ మహిళ తోడి కోడలి కుమారుడి(4)పై దారుణానికి ఒడిగట్టింది. జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి యాసిడ్ తాగించింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 16, 2026 / 11:44 AM IST

భూవివాదం.. కత్తితో గొంతు కోశారు!

AP: తిరుపతి గ్రామీణ(M) అడపారెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భూవివాదంతో అమర్నాథ్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో గొంతు కోసి చంపేశారు. అదే గ్రామానికి చెందిన బొమ్మ రాహుల్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్ రెడ్డి కుటుంబసభ్యులతో పరారు కావడంతో ఆయన బైకుకు మృతుడి బంధువులు నిప్పుపెట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

April 16, 2026 / 09:15 AM IST

కర్నూలు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

AP: కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలు, బాలిక, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా కర్ణాటకలోకి చిక్ మంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.

April 16, 2026 / 06:31 AM IST

BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

AP: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 16, 2026 / 05:43 AM IST

భారీ అగ్నిప్రమాదం.. పలు ఇళ్లు దగ్ధం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వికాస్‌నగర్ స్లమ్ ఏరియాలో మంటలు చెలరేగడంతో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 16, 2026 / 12:46 AM IST

పంట పొలంలోకి లారీ.. తప్పిన ప్రమాదం

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం పెను ప్రమాదం తప్పింది. లారీ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

April 15, 2026 / 08:10 PM IST

180 మంది పిల్లలపై లైంగిక వేధింపులు

మహారాష్ట్రలో తన్వీర్ అనే ఓ యువకుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సుమారు 180 మంది పిల్లలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, స్థానిక మున్సిపల్ అధికారులు అతడి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాలను గుర్తించి బుల్డోజర్‌తో కూల్చివేతలు చేపట్టారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

April 15, 2026 / 03:10 PM IST

బడంగ్‌పేట్ బీజేపీ అధ్యక్షుడు ఆత్మహత్య!

TG: HYD బడంగ్‌పేట్ BJP అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తిగా పేరు సంపాదించారు. బడంగ్‌పేట్ సర్కిల్‌లో అవినీతిపై పోరాడి రూ.150 కోట్ల స్కామ్‌ను వెలుగులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన ఆత్మహత్యపై పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 15, 2026 / 01:37 PM IST

గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు మృతి

AP: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని నివాస గృహంలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు జిలెటిన్‌ స్టిక్స్‌ పేలడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.

April 15, 2026 / 01:00 PM IST

పార్క్ చేసిన కారులో చిన్నారి మృతి

TG: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో విషాదం జరిగింది. పార్క్ చేసిన కారులో ఓ పాప ఆడుకుంటూ ఊపిరాడక చనిపోయింది. చరణ్య కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు వెతికారు. పక్కింటివారు కారులో ఉన్న పాపను అపస్మారక స్థితిలో గుర్తించారు. హుటాహుటిన పేరెంట్స్ పాపను కామినేని ఆస్పత్రికి తరలించగా.. చరణ్య అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 15, 2026 / 10:51 AM IST

పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ జాతీయులతో వెళ్తున్న పడవ అండమాన్‌ వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 250 మంది గల్లంతయ్యారు. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్‌ నుంచి బయలుదేరిన పడవ మలేషియాకు వెళ్తుండగా ఘటన జరిగింది. బలమైన గాలులు, సామర్థ్యానికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అధికారులు రెస్య్కూ ఆపరేషన్‌ చేపట్టారు.

April 15, 2026 / 09:02 AM IST

గంజాయి దందా.. 18 మంది అరెస్ట్

AP: కడప జిల్లా పులివెందులలో గంజాయి, నాటుసారా విక్రయిస్తున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 కిలోల గంజాయి, 110 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన వారిలో వివేకా హత్య కేసులో పలుమార్లు సీబీఐ విచారణ ఎదుర్కొన్న భరత్‌కుమార్ కూడా ఉన్నాడు. గతంలో తుపాకీ లైసెన్స్ కలిగి, ఒకరిని కాల్చి చంపిన కేసులో భరత్ నిందితుడు.

April 14, 2026 / 08:55 PM IST