• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

విషాదం.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాడేరు మండలం బంట్రోతుపుట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బైక్ లోయలోపడి తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఈ ఘటనలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

April 12, 2026 / 07:58 PM IST

విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలుర మృతి

AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు బాలురు మరణించారు. పన్నెడా గ్రామానికి చెందిన ఐదుగురు బాలురు మత్స్యగెడ్డలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిలో నలుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా మరొకరు బయటకు వచ్చి కేకలు వేశారు. సమీపంలోని మత్స్యకారులు ఒకరిని కాపాడారు. మిగిలిన ముగ్గురూ మృతిచెందారు. మృతులను హర్షిత్(12), ప్రదీప్(11), బబులు (10)గా గుర్తించారు.

April 12, 2026 / 05:31 PM IST

ATMలలో పెట్టాల్సిన రూ.1.2 కోట్లు మాయం

TG: ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లకు పైగా నగదు మాయమయ్యాయి. ఈ ఘటన HYDలోని SR నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో SR నగర్ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేపట్టగా 8 ఏటీఎంలలో భారీగా నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. రూ.1,20,98,500 నగదు లోటు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

April 12, 2026 / 02:50 PM IST

13 ఏళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం

AP: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాళ్లూరు మండలంలోని ఓ గ్రామంలో కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తల్లి భర్తతో గొడవపడి ఇద్దరు కుమార్తెలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. రెండ్రోజుల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో ఒంగోలు రిమ్స్‌లో చేర్పించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

April 12, 2026 / 02:34 PM IST

ఆస్తి తగాదా.. అన్నను హతమార్చిన తమ్ముడు

AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురంలో దారుణం జరిగింది. అన్న దేవభక్తుడి(38)ని తమ్ముడు విజయరాజు రోకలి బండతో కొట్టి చంపాడు. పొలం పంపకాల విషయంలో అన్నదమ్ములైన దైవభక్తుడు, విజయరాజుకు తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరగగా విజయరాజు రోకలిబండతో అన్న దైవ భక్తుడుపై దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

April 12, 2026 / 12:46 PM IST

బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నేలవంచలో విషాదం చోటుచేసుకుంది. బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. విద్యార్థులను శ్రీజ(9), చైత్ర(9)గా గుర్తించారు. విద్యార్థుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

April 12, 2026 / 11:42 AM IST

దారుణం.. ఆర్‌ఎంపీ డాక్టర్ దారుణ హత్య

AP: ప్రకాశం జిల్లా ధర్మవరంలో RMP డాక్టర్ కోటిరెడ్డి(47) హత్యకు గురయ్యాడు. ముగ్గురు దుండగులు వైద్యం కోసమని అర్ధరాత్రి డాక్టర్ ఇంటి తలుపు తట్టారు. తలుపు తీయగానే కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో డాక్టర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కోటిరెడ్డి భార్య భయాందోళనతో స్పృహ కోల్పోయింది. దుండగులు మాస్కులు ధరించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 12, 2026 / 10:06 AM IST

అదుపుతప్పి బొలేరో వాహనం బోల్తా

AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బొలేరోలో 20 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. బొలేరో వాహనం నర్సాపురం నుంచి సత్తెనపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

April 12, 2026 / 06:54 AM IST

విషాదం.. ముగ్గురు సజీవదహనం

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, వ్యాన్ ఢీకొని.. నలుగురు వ్యక్తులు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు వాహనాల్లో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

April 12, 2026 / 01:06 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

బీహార్‌లోని కతిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, బస్సు, వ్యాన్ ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 12, 2026 / 12:28 AM IST

సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్య

AP: కడప జిల్లా ప్రొద్దుటూరు లింగాపురంలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను కర్నూలుకు చెందిన ప్రమీల, రంగస్వామిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా వీరు ఇరువురు సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమీల మృతితో ఆమె ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

April 11, 2026 / 08:36 PM IST

పాఠశాల బస్సు కింద పడి విద్యార్థి మృతి

AP: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానిలో విషాదం నెలకొంది. పాఠశాల బస్సు కింద పడి నాలుగేళ్ల విద్యార్థి మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రహదారిపై విద్యార్థి కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. బస్సులో సహాయకుడు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

April 11, 2026 / 06:24 PM IST

ఖాజీపేట ఘటన.. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

AP: కడప జిల్లా ఖాజీపేటలో బాలిక గొంతు కోసి యువకుడు చంపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిమ్స్‌లో కీర్తన మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి అయింది. అనంతరం కీర్తన మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఖాజీపేటలోని అగ్రహారంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

April 11, 2026 / 03:20 PM IST

ప్రేమికులే టార్గేట్.. ఏఎస్ఐ అరాచకం..!

PLD: మాచర్లలో ఓ ఏఎస్ఐ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆటో డ్రైవర్ సాయంతో ఏకాంతంగా ఉన్న ప్రేమజంటలను రహస్యంగా వీడియోలు తీయిస్తున్నాడని సమాచారం. వాటితో బెదిరించి డబ్బులు లాగడంతో పాటు యువతులు, మహిళలను వేధిస్తున్నాడని, ఇందుకు సంబంధించిన బెదిరింపు వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్థానిక ఎస్సై, కానిస్టేబుల్ సైతం ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

April 11, 2026 / 10:19 AM IST

బాలికపై యువకుడు అత్యాచారయత్నం

AP: నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఓ యువకుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బ్రిడ్జి కిందికి బాలికను తీసుకెళ్లి నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక తమ్ముడు కేకలు వేశాడు. స్థానికులు గమనించి నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 11, 2026 / 08:56 AM IST