• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

బ్యాంకులో అగ్నిప్రమాదం

TG: HYD మధురనగర్‌లోని ఓ బ్యాంక్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో భవనం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 31, 2026 / 10:39 PM IST

వాష్‌రూమ్‌లో శిశువు మృతదేహం లభ్యం

TG: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని ఓ ఆసుపత్రిలో మృత శిశువు కలకలం రేపింది. వాష్‌రూమ్‌లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభ్యమైంది. మగబిడ్డకు జన్మనిచ్చిన ఓ గర్భిణీ.. ఫ్లష్ ట్యాంక్‌లో పసికందును పడేసింది. ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 31, 2026 / 07:29 PM IST

బెంగళూరులో తెలుగు టెకీ ఆత్మహత్య

బెంగళూరులో సహజీవనం చేస్తున్న టెకీ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతుడిని TG సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుంట బాబురెడ్డి(31)గా గుర్తించారు. అతడు ఆత్మహత్య చేసుకున్న అనంతరం అతడితో సహజీవనం చేస్తున్న యువతి(31) సైతం బలవన్మరణానికి పాల్పడింది. వారు ఉంటున్న భవనంలోని 17వ అంతస్తుపై నుంచి ఆమె దూకి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

March 31, 2026 / 01:34 PM IST

BREAKING: కామాంధుడికి మరణశిక్ష

UPలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ముఖేశ్‌ పటేల్‌కు ప్రయాగ్‌రాజ్‌ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఉరిశిక్షతో పాటు నిందితుడికి కోర్టు రూ.25,000 జరిమానా విధించింది. ఆ జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.

March 31, 2026 / 01:17 PM IST

ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసిన మహిళ

UPలోని అమ్రోహాలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రూహి అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఆహారంలో మత్తుమందు ఇచ్చి, గొంతు కోసి హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా దోపిడీ అని నమ్మించేందుకు రాత్రంతా శవం పక్కనే పిల్లలతో కలిసి నిద్రపోయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.

March 31, 2026 / 01:15 PM IST

బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

NLR: బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడింది. సంగం మండలం మక్తాపురానికి చెందిన డి. బుజ్జిబాబుకు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు, రూ. 42 వేల ఫైన్ విధిస్తూ జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పు చెప్పారు. 2024 మార్చి 30వ తేదీన రాత్రి బుజ్జిబాబు బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.

March 31, 2026 / 12:30 PM IST

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులకు మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా రూ.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. డ్రగ్ నెట్‌వర్క్ కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.

March 31, 2026 / 11:52 AM IST

BREAKING: తొక్కిసలాట.. 8 మంది మృతి

బీహార్ నలంద జిల్లాలోని శీతలా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి మంగళవారం మాదిరిగానే అమ్మవారిని పూజించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా.. మరో 12 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. సహాయకచర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

March 31, 2026 / 11:43 AM IST

ఉద్యోగాల పేరుతో టోకారా.. కేటుగాడు అరెస్ట్

విశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మహిళలను మోసం చేస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసి కె.లక్ష్మీ నాయుడు‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ నరసింహ్మమూర్తి తెలిపారు. ఈ నెల 14న ఓ మహిళను హోటల్‌కు పిలిచి మత్తుమందు ఇచ్చి నగలు, నగదు, ఫోన్‌తో పరారయ్యాడు. అతనిపై 52 కేసులు, రెండు హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

March 31, 2026 / 11:37 AM IST

యాక్సిస్ బ్యాంక్‌కు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ

AP: సైబర్ నేరగాళ్లు విజయవాడలోని 3 వేర్వేరు బ్రాంచుల్లో యాక్సిస్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారు. ఏలూరు రోడ్, గుణదల, బెంజిసర్కిల్ బ్రాంచుల్లో ఫేక్ ఆధార్, అడ్రస్, పే స్లిప్స్‌తో బ్యాంకు ఖాతాలు తెరిచి.. క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5.28 కోట్లు దోచేశారు. ఎంతకూ తీసుకున్న క్రెడిట్ రీపే చేయకపోవడంతో బ్యాంకు అధికారులు ఆయా అడ్రస్‌‌లకు వెళ్లగా.. అసలు విషయం బయటపడింది.

March 31, 2026 / 11:12 AM IST

BREAKING: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

AP: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. స్టేషన్‌లో నిల్వ ఉంచిన టపాసులు బయటకు తీస్తుండగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో ఎస్సై సహా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 31, 2026 / 10:51 AM IST

విషాదం.. రీల్స్ చేస్తూ బాలిక మృతి

AP: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. అలిపిరి పీఎస్ పరిధి రాజారెడ్డి నగర్‌లో రీల్స్ చేస్తూ 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఐదో అంతస్తులో రీల్స్ చేస్తున్న బాలిక ఒక్కసారిగా కిందపడిపోయింది. మరణించడంతో ఆమె బాడీని తిరుపతి రుయాకు తరలించారు. ఆమె కుటుంబం నేపాల్ నుంచి రాగా.. తండ్రి బహదూర్ అదే అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

March 31, 2026 / 10:37 AM IST

దారుణం.. మద్యం మత్తులో భార్య, పిల్లలపై దాడి

TG: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో దారుణం చోటుచేసుకుంది. పులిగోనీపల్లి తండాలో బాణావత్ రామ్‌దాస్‌ నాయక్‌ మద్యం మత్తులో భార్య, పిల్లలను చావబాదాడు. ఈ ఘటనలో భార్య, కుమారుడు మృతిచెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ జానకి రెడ్డి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 31, 2026 / 09:55 AM IST

BREAKING: పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

AP: నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. వెంకటాచలం-మనుబోలు మధ్య గూడ్స్‌లోని పాల ట్యాంకర్‌ బోల్తా పడింది. కొమ్మలపూడి జంక్షన్‌ వద్ద ట్రాక్‌పై ట్యాంకర్‌ అడ్డంగా పడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గూడ్స్‌ రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 31, 2026 / 09:09 AM IST

అమలాపురంలో గంజాయితో వ్యక్తి అరెస్ట్

కోనసీమ: అమలాపురం దుడ్డివారి అగ్రహారానికి చెందిన బొంతు నవీనకుమార్(23)ను రెండు కేజీల గంజాయితో పట్టుకున్నట్లు సోమవారం రాత్రి పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… గతంలో నేర చరిత్ర ఉన్న నవీన్ గంజాయి అమ్ముతున్నాడనే సమా చారంతో దాడిచేసి పట్టుకున్నామని వెల్లడించారు. గతంలో అతడిపై ఎనిమిది కేసులు ఉన్నాయన్నారు.

March 31, 2026 / 09:00 AM IST