AP: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని నివాస గృహంలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు జిలెటిన్ స్టిక్స్ పేలడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.