TG: నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో విషాదం జరిగింది. పార్క్ చేసిన కారులో ఓ పాప ఆడుకుంటూ ఊపిరాడక చనిపోయింది. చరణ్య కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు వెతికారు. పక్కింటివారు కారులో ఉన్న పాపను అపస్మారక స్థితిలో గుర్తించారు. హుటాహుటిన పేరెంట్స్ పాపను కామినేని ఆస్పత్రికి తరలించగా.. చరణ్య అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.