TG: HYD బడంగ్పేట్ BJP అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తిగా పేరు సంపాదించారు. బడంగ్పేట్ సర్కిల్లో అవినీతిపై పోరాడి రూ.150 కోట్ల స్కామ్‌ను వెలుగులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన ఆత్మహత్యపై పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.