• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఫోన్ పాస్‌వర్డ్ అడిగిందని భార్య దారుణ హత్య

మధ్యప్రదేశ్‌లో మొబైల్ పాస్‌వర్డ్ గొడవ భార్య ప్రాణం తీసింది. ఫోన్ పాస్‌వర్డ్ అడిగిందనే కోపంతో దీపక్ మిశ్రా అనే వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచాడు. ముగ్గురు పిల్లల కళ్ల ముందే జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పరారైన నిందితుడి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.

April 10, 2026 / 02:38 PM IST

పెళ్లికి నిరాకరించిందని యువతి హత్య

AP: కడప జిల్లా ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమని అడగ్గా.. యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహనికి గురైన శ్రీనివాసులు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలోనే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

April 10, 2026 / 02:04 PM IST

HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. ప్రియురాలు ఆత్మహత్య

TG: పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టి, ప్రియురాలి శరీరంలోకి బలవంతంగా HIV సోకిన రక్తాన్ని ఎక్కించాడు ఓ కిరాతకుడు. ఆ ద్రోహాన్ని, అనారోగ్యాన్ని తట్టుకోలేక పోచారం ఐటీ కారిడార్‌కు చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెల జరిగిన ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు విడవడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

April 10, 2026 / 01:39 PM IST

క్రికెట్ ప్రెడిక్షన్ పేరుతో భారీ మోసం

AP: క్రికెట్ ప్రెడిక్షన్ పేరుతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ వెబ్‌సైట్లను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓ యువకుడి నుంచి రూ.12.50 లక్షలు దోచుకున్నట్లు వెల్లడైంది. దీంతో సాయిగణేష్, అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

April 10, 2026 / 10:41 AM IST

చెక్ బౌన్స్ కేసు.. 6 నెలలు జైలు శిక్ష

సత్యసాయి: హిందూపురానికి చెందిన ఫైనాన్స్ నిర్వాహకుడు మణికి చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలు శిక్ష పడింది. సరోజాబాయి, పవిత్ర నుంచి రూ. 5లక్షల రుణం తీసుకున్నాడు. ఆయన చెక్కు రూపంలో చెల్లించాడు. చెక్కు చెల్లకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా, న్యాయాధికారి రమణయ్య శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించారు. అనంతరం ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేశారు.

April 10, 2026 / 10:11 AM IST

బర్రెల కోసం గాలింపుకు వెళ్ళి వ్యక్తి గల్లంతు

NLR: కలువాయి మండలం పెరంకొండకు చెందిన బి. వివేక్ (38) గురువారం సాయంత్రం తన బర్రెలు ఇంటికి రాకపోవడంతో ఎస్.వెంకటేశ్వర్లు 60తో కలిసి ముక్కు తిప్పు ప్రాంతంలో వెతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో కండలేరు జలాశయం దాటడంలో వివేక్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్సై కోటయ్య ఆధ్వర్యంలో ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.

April 10, 2026 / 09:52 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు: ఎస్సై

E.G: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ పీ.మనోహర్ గురువారం హెచ్చరించారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్‌పై డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ నడిపిన రామారావు, లారీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రూ.11,500 చొప్పున జరిమాన విధించారు.

April 10, 2026 / 09:07 AM IST

మహిళకు వేధింపులు.. ZPTCపై కేసు నమోదు

AP: ప.గో జిల్లా వీరవాసరం ZPTC జయప్రకాష్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.10 లక్షల నగదు, బంగారం తీసుకున్నాడని ఆరోపించింది. శారీరకంగా, మానసికంగా వేధించాడని వీడియో విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు అతడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

April 10, 2026 / 09:04 AM IST

తిరుమలలో VIP దర్శనం పేరుతో మోసం

AP: తిరుమలలో VIP దర్శనం పేరుతో ఓ దుండగుడు మోసానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడు సెంథిల్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. TTD లోగోతో నకిలీ ప్రకటనలు చేస్తూ.. ఐదు అడుగుల దూరంలోనే శ్రీవారి దర్శనమంటూ మోసానికి తెర దించాడు. ఒక్కో టికెట్‌కు రూ.16,500 వరకు వసూలు చేశాడు. అతడిపై కేసు నమోదు చేసి ల్యాప్‌టాప్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

April 10, 2026 / 08:54 AM IST

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

KKD: తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 1వ వార్డు డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న తాటిపర్తి బాలాజీ(28) అనే యువకుడు గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతుడు ప్రత్తిపాడు ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. 

April 10, 2026 / 08:22 AM IST

హైవే పై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

NLR: కలువాయి మండలంలోని సచివాలయం సమీపంలో గురువారం రాత్రి 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అనంతరం 108కు సమాచారం అందించగా క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

April 10, 2026 / 08:17 AM IST

డ్రంకెన్ డ్రైవ్.. ఇద్దరికి జరిమానా

E.G: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని SI పీ.మనోహర్ హెచ్చరించారు. దేవరపల్లి పరిధిలోని NHపై మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బైక్ నడుపుతున్న రామారావు, లారీ నడుపుతున్న సుబ్రహ్మణ్యంలను పట్టుకుని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా రూ. 11, 500 జరిమానా విధించినట్లు తెలిపారు. 

April 10, 2026 / 06:50 AM IST

మైనర్ డ్రైవింగ్‌పై 98 కేసులు నమోదు

ATP: జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మొత్తం 98 కేసులు నమోదు చేసి, 97 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వాహనాలు నడిపిన మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

April 10, 2026 / 06:16 AM IST

ముంబై విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1Bలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టెర్మినల్ లోపలి కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు ధృవీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

April 10, 2026 / 05:43 AM IST

విషాదం.. ముగ్గురు బాలికలు మృతి

AP: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ దిగుతూ నలుగురు బాలికలు జలపాతంలో పడిపోయారు. దీంతో ముగ్గురు మృతి చెందగా మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆ బాలికను చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు హుకుంపేట మండలం జుంబువలస వాసులుగా పోలీసులు గుర్తించారు.

April 9, 2026 / 04:05 PM IST