AP: క్రికెట్ ప్రెడిక్షన్ పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ వెబ్సైట్లను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓ యువకుడి నుంచి రూ.12.50 లక్షలు దోచుకున్నట్లు వెల్లడైంది. దీంతో సాయిగణేష్, అనిల్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.