MHBD: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శనివారం జిల్లాస్థాయి నార్కో సమావేశంలో గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగంపై అవగాహన పెంచాలని, విద్యాసంస్థలు, పాన్ షాపులు, బార్లు వంటి ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.