AP: తిరుమలలో VIP దర్శనం పేరుతో ఓ దుండగుడు మోసానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడు సెంథిల్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. TTD లోగోతో నకిలీ ప్రకటనలు చేస్తూ.. ఐదు అడుగుల దూరంలోనే శ్రీవారి దర్శనమంటూ మోసానికి తెర దించాడు. ఒక్కో టికెట్కు రూ.16,500 వరకు వసూలు చేశాడు. అతడిపై కేసు నమోదు చేసి ల్యాప్టాప్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.