ఇండోనేషియా వెస్ట్ కాళీమంతన్ ప్రావిన్స్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఎనిమిది మంది మృతిచెందారు. మెలావి జిల్లాలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ అయింది. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.