• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

AP: కాకినాడ జిల్లా చెందుర్తి వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 27, 2026 / 07:44 AM IST

శేషాచలం అడవిలో భారీ అగ్నిప్రమాదం

AP: తిరుపతి శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీవకోన సమీపంలోని మొండోడి కోన వద్ద ఆకతాయిలు పెట్టిన మంటలు వేగంగా విస్తరించి, సుమారు రెండు కిలోమీటర్ల మేర పచ్చని చెట్లను బూడిద చేశాయి. అటవీశాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఎర్రచందనం గోదాముల వరకు మంటలు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమై అదుపు చేసే చర్యలు చేపట్టారు.

April 27, 2026 / 07:39 AM IST

శేషాచలం అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు

AP: శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. జీవకోన సమీపంలోని మొండోడికోన వద్ద నుంచి తిమ్మినాయుడుకోన వద్దనున్న ఎర్రచందనం గిడ్డంగుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో దాదాపు 2 కి.మీ. మేర అటవీ ప్రాంతం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

April 27, 2026 / 12:16 AM IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వ్యాన్.. ఒకరు మృతి

SKLM: సారవకోట మండలం పెద్దలంబ రహదారిలో స్కూటీని వ్యాన్ ఢీకొనడంతో ఒకరు అక్కడకక్కడే మృతి చెందారు. ఎస్సై అనిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు పాతపట్నం మండలానికి చెందిన బత్తిలి గణపతి (34) తెంబురు నుంచి పెద్ద లంబ స్కూటీపై వస్తుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఘటన జరిగిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

April 26, 2026 / 07:25 PM IST

బస్టాండ్‌లో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు పరుగులు

AP: విజయవాడ బస్టాండ్ మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ల సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో మొదటి అంతస్తులో ఉంచిన పాత ఫర్నిచర్, పాత కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. 

April 26, 2026 / 06:42 PM IST

రూ.10కి సాంబార్ ఇవ్వలేదని తల్వార్‌తో దాడి

TG: సంగారెడ్డి జిల్లాలోని బీరంగూడలో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. కర్రీ పాయింట్ నిర్వాహకుడు ఉదయ్‌పై తల్వార్‌తో దాడి చేశాడు. రూ.10కి సాంబార్ ఇవ్వలేదని జీవన్ దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఉదయ్‌కి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

April 26, 2026 / 12:34 PM IST

డివైడర్‌ను ఢీకొన్న ఆటో.. ఇద్దరు మహిళలు మృతి

TG: సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో డివైడర్‌ను ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

April 26, 2026 / 07:42 AM IST

కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

TG: హైదరాబాద్‌లోని అప్పా జంక్షన్ దగ్గర కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును నిలిపివేసి బయటకు వచ్చేశాడు. అయితే కారు పూర్తిగా తగలబడింది. ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనతో రహదారిపై భారీగా ట్రాపిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

April 25, 2026 / 09:31 PM IST

భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు

TG: భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టును హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దాదాపు రూ.2.29 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 333 కిలోల గంజాయిని సీజ్ చేసి 126 మందిని అరెస్ట్ చేశారు. అలాగే రూ.25.82 లక్షల విలువైన హాష్ ఆయిల్‌ను, రూ.22.5 లక్షల విలువైన ఓపీఎం మిక్స్ పౌడర్‌ను పట్టుకున్నారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

April 25, 2026 / 08:08 PM IST

హత్య చేసిన కొడుకు.. పోలీసులకు పట్టించిన తల్లి

TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో గొడవపడి స్నేహితుడు మధును రాడ్డుతో కొట్టి చంపిన చరణ్, నవీన్.. మృతదేహాన్ని ఇసుక దిబ్బలో పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న చరణ్ తల్లి, కొడుకు అని చూడకుండా పోలీసులకు పట్టించి నిజాయితీ చాటుకుంది. పోలీసులు చరణ్‌ను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారు. కొడుకు హంతకుడిగా మారడంతో తల్లి విలపిస్తోంది.

April 25, 2026 / 12:30 PM IST

ఫెయిల్ అవుతానేమోనని విద్యార్థిని ఆత్మహత్య

TG: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానేమోనన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా కొత్తపల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ(16) ఇటీవల జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసింది. అయితే, ఫెయిల్‌ అవుతానేమోనన్న భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 25, 2026 / 11:30 AM IST

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో.. నలుగురు మృతి

AP: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతులు రాజేంద్రప్రసాద్, మారుతిగా గుర్తించారు. అలాగే, విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బల దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ప్రమాదాల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 25, 2026 / 09:48 AM IST

అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు

TG: పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్‌లో దారుణం జరిగింది. నిద్రిస్తున్న అన్న రఘుపై తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తల్లిని ఇంట్లోకి రానివ్వట్లేదని ఆగ్రహానికి గురైన అనిల్, కిటికీలో నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగి తీవ్రగాయాలైన రఘును వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 25, 2026 / 09:32 AM IST

ఐటీ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

AP: విశాఖలో ఐటీ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉన్నతి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి ఉద్యోగాలంటూ లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు చేశారు. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

April 24, 2026 / 11:18 AM IST

రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

AP: తిరుపతి జిల్లాలోని తాల్వాయిపాడు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం.

April 24, 2026 / 10:01 AM IST