TG: సంగారెడ్డి జిల్లాలోని బీరంగూడలో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. కర్రీ పాయింట్ నిర్వాహకుడు ఉదయ్‌పై తల్వార్‌తో దాడి చేశాడు. రూ.10కి సాంబార్ ఇవ్వలేదని జీవన్ దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఉదయ్‌కి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.