• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 24 గ్రాముల బంగారం, మూడు బైకులు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 21, 2026 / 01:36 PM IST

బాలికపై ఇద్దరు పలుమార్లు అత్యాచారం

TG: హైదరాబాద్‌లోని దుండిగల్‌లో దారుణం జరిగింది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అంతేకాకుండా వీడియోలు తీసి బాలికను బెదిరించి శివకుమార్, రాము పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో వారిపై పోలీసులు పోక్సో కేసు పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

May 21, 2026 / 11:37 AM IST

మాజీ ఐపీఎస్ భార్య హత్య.. ముగ్గురు అరెస్ట్

TG: మాజీ IPL అధికారి భార్య తనూజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య, బంగారం చోరీలో ఏడుగురు పాల్గొన్నారని నిర్థారించారు. ప్రధాన నిందితుడు ముంబై క్యాబ్ డ్రైవర్ నేపాలీ సునీల్‌గా గుర్తించారు. చోరీ చేసిన బంగారాన్ని జ్యువెలరీ షాపులో విక్రయించారు. బంగారం కొనుగోలు చేసిన షాప్ యాజమానిని అరెస్ట్ చేశారు.

May 21, 2026 / 10:00 AM IST

ప్రేయసి తల్లిదండ్రులను చంపిన ప్రేమోన్మాదికి ఉరిశిక్ష

TG: ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు ప్రియురాలి తల్లిదండ్రులను నరికి చంపిన ప్రేమోన్మాదికి ఉరిశిక్ష పడింది. 2026 మే 20వ తేదీన హంతకునికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది వరంగల్ జిల్లా కోర్టు.  2024 జులైలో తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని ప్రియురాలి తల్లిదండ్రులను ప్రేమోన్మాది నాగరాజు నరికి చంపిన విషయం తెలిసిందే. 16 చింతలతండాలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.

May 20, 2026 / 07:45 PM IST

గంజాయి కలకలం.. ముగ్గురు అరెస్ట్

AP: కడప జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అంగడివీధికి చెందిన ప్రధాన విక్రయదారులు మాధవ, సాకే శంకర్లతో పాటు మనోజ్ కుమార్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు, విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

May 20, 2026 / 07:04 PM IST

కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతి

రాజస్థాన్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. అక్కాచెల్లెళ్లు ఆడుకుంటూ వెళ్లి సర్వీస్ సెంటర్లో నిలిపిన కారులో చిక్కుకుపోయారు. కారు డోర్లు లాక్ కావడంతో బయటకు రాలేకపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఈ క్రమంలో కారులో అపస్మారక స్థితిలో బాలికలను గుర్తించారు. అప్పటికే ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.

May 20, 2026 / 06:29 PM IST

పిడుగు పాటు.. ముగ్గురు కూలీలు మృతి

AP: విజయనగరం రాజాం మండలం గెడ్డవలసలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పిడుగుపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మృతులు సత్తెమ్మ, రాజు, నర్సమ్మగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 5, 2026 / 05:59 PM IST

భారీ పేలుడు.. 21 మంది మృతి

చైనా హునాన్ ప్రావిన్స్‌లోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా.. 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 5, 2026 / 09:37 AM IST

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను చేవెళ్ల వాసులుగా పోలీసులు గుర్తించారు. తుల్జాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

May 5, 2026 / 08:58 AM IST

ఇన్ స్టా రీల్ చూసి వంట.. నలుగురికి అస్వస్థత

KKD: SMలో వైరల్ గా మారిన వంటకాన్ని తిని కుటుంబం అస్వస్థకు గురైన ఘటన జల్లాలో చోటుచేసుకుంది. గండేపల్లి మండలం ఎర్రంపాలెంలో ఒక కుటుంబం ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త పువ్వుతో పప్పు వండుకుని తిన్నారు. అది తిన్న నలుగురు జయలక్ష్మి, గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బులకు తీవ్ర వాంతులు అయ్యాయి. దీంతో వారిని కాకినాడ GGHక తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

May 5, 2026 / 07:00 AM IST

తమ్ముడిపై సోదరి ఫిర్యాదు.. కేసు నమోదు

NLR: నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సొంత తమ్ముడు ఇంటిపై దౌర్జన్యం చేస్తున్నాడని ఓ మహిళ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తూ తనపై దాడికి యత్నిస్తున్నాడని ఆమె తెలిపింది. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

May 5, 2026 / 06:20 AM IST

దారుణం.. కొడుకుతో కలిసి ప్రియుడి హత్య

TG: HYDలోని జీడిమెట్ల అంబేద్కర్‌నగర్‌లో దారుణం జరిగింది. కొడుకుతో కలిసి, ఓ మహిళ తన ప్రియుడిని హతమార్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డితో గత పదేళ్లుగా మహిళ సహజీవనం చేస్తోంది. 19 ఏళ్ల కుమారుడు కూడా వాళ్లతోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తల్లీ కొడుకులు మటన్ కొట్టే కత్తితో నరికి అతడిని హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

May 4, 2026 / 11:34 AM IST

లారీని ఢీకొట్టిన అంబులెన్స్.. నలుగురు మృతి

AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ అంబులెన్స్ ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు వెస్ట్ బెంగాల్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పేషెంట్‌ను బెంగళూరు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

May 4, 2026 / 08:02 AM IST

మనస్థాపానికి గురై వివాహిత ఆత్మహత్య

SKLM: జి.సిగడాం మండలం ఆనందపురంలో కిమిడి రాజేశ్వరి (26) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. భర్త మద్యం, బెట్టింగ్‌లకు బానిసై తరచూ గొడవలు జరిగేవి. వారం క్రితం పిల్లలతో తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన ఆమె, ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

May 4, 2026 / 07:37 AM IST

జిల్లాలో దంపతుల దారుణ హత్య

SKLM: చిల్లంగి అనుమానంతో భార్యాభర్తల హత్య కలకలం రేపింది. చినరాజపురంలో సవర ఇల్లంగో (55), జ్యోతి (50)లను తోటయ్య కత్తితో హత్య చేశాడు. తన కుటుంబ సభ్యుల అనారోగ్యానికి చేతబడి కారణమని భావించినట్టు సమాచారం. ఘటనను గోప్యంగా ఉంచి దహనానికి యత్నించినా, కుమారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

April 29, 2026 / 05:16 PM IST