TG: మాజీ IPL అధికారి భార్య తనూజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య, బంగారం చోరీలో ఏడుగురు పాల్గొన్నారని నిర్థారించారు. ప్రధాన నిందితుడు ముంబై క్యాబ్ డ్రైవర్ నేపాలీ సునీల్‌గా గుర్తించారు. చోరీ చేసిన బంగారాన్ని జ్యువెలరీ షాపులో విక్రయించారు. బంగారం కొనుగోలు చేసిన షాప్ యాజమానిని అరెస్ట్ చేశారు.