VSP: సింహాచలం పరిధిలో బుధవారం మధ్యాహ్నం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పద్మావతి నగర్‌కు చెందిన రిటైర్డ్ టీచర్ దువ్వాకుల లక్ష్మి బ్యాంకు పని నిమిత్తం సింహపురి కాలనీకి వెళ్లారు. తిరిగి వస్తుండగా దారిలో గుర్తు తెలియని యువకులు బైక్‌పై వచ్చి ఆమె కళ్లలో స్ప్రే కొట్టారు. అనంతరం లక్ష్మి మెడలో గొలుసు తెంపి పారిపోయారు. బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.