బొమన్ ఇరానీ తాజా వ్యాఖ్యలతో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం కేవలం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మాత్రమే కాదని, ఇందులో అద్భుతమైన దేశభక్తి అంశాలు, ప్రేక్షకులను అలరించే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. చరణ్ నటనను మెచ్చుకుంటూ, ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.