WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 76 మంది మద్యం తాగి పట్టుపడ్డారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 44 కేసులు, సెంట్రల్ జోన్లో 8, ఈస్ట్ జోన్లో 14, వెస్ట్ జోన్లో 10 కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.