ATP: కూడేరు సమీపంలోని పీఏబీఆర్ జలాశయంలో నీటిమట్టం 2.3 టీఎంసీలకు చేరుకుంది. ఈ ఏడాది వర్షాభావం కారణంగా నీటి నిల్వలు తగ్గాయి. తాగునీటి పథకాల కోసం రోజూ 35 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి, లీకేజీల రూపంలో మరో 100 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. నీటి మట్టం తక్కువగా ఉన్నా తాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి కొరత ఉండదని అధికారులు తెలిపారు.