విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాగబంధం’ మూవీ 2026 జూలై 3న విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా, అన్ని భాషల్లోనూ ఈ మూవీని ఇదే సంస్థ గ్రాండ్గా ప్రజెంట్ చేయబోతున్నారట.