సత్యసాయి: కదిరి రూరల్ మండలం మోటుకుపల్లి గ్రామంలో ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.43.60 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంలో ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.