సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ గురించే చర్చ నడుస్తోంది. ఈ ఉద్యమం వెనక ఉన్న వ్యక్తే అభిజిత్ దిప్కే. పూణెలో జర్నలిజం చదివిన అబిజిత్.. ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నిరుద్యోగి. అంతకుముందు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేశారు. ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.