TG: కొత్త నిబంధనల ప్రకారం.. వేతనాల విషయంలో నిబంధనలు పాటించని యజమానులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. మొదటిసారి తప్పు చేస్తే గరిష్ఠంగా రూ.50వేల వరకు, మళ్లీ అదే తప్పు చేస్తే.. రెండోసారి ఉల్లంఘనకు రూ. లక్ష వరకు జరిమానా లేదా 3 నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. కార్మికులకు రావాల్సిన కనీస వేతనం కంటే తక్కువ చెల్లించినప్పుడు ఆ వ్యత్యాసాన్ని వడ్డీతో సహా చెల్లించాలి.