బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ 2-0 తేడాతో ఘోర టెస్ట్ సిరీస్ పరాజయం చవిచూసింది. మే 20న జరిగిన ఆఖరి టెస్టులో 78 పరుగులతో ఓడటంతో షాన్ మసూద్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో 2026 ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటన కంటే ముందే మసూద్ స్థానంలో కొత్త టెస్ట్ కెప్టెన్ను నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది.