NLR: కావలి వడ్డిపాలెంలో పోలీసులు భారీ సోదాలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలే లక్ష్యంగా గురువారం 200 ఇళ్లలో ముమ్మర తనిఖీలు జరిపారు. కావలి సీఐ ఆధ్వర్యంలో సరైన పత్రాలు లేని 30 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ఉంటాయని, సమాచారముంటే పోలీసులకు తెలపాలని విజ్ఞప్తి చేశారు.