చాలామంది బరువు తగ్గాలని మొదట భోజనం మానేయడం లేదా ఆకలిని చంపుకోవడం చేస్తారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. నిజానికి ఆకలి వేస్తుందంటే మీ జీర్ణక్రియ చురుగ్గా ఉందని అర్థం. కడుపు ఖాళీగా ఉంచి ఆకలిని నియంత్రించడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. దీనివల్ల భవిష్యత్‌లో షుగర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మన ఇంజిన్‌కు ఇంధనం ఎలాగో.. శరీరానికి ఆహారం అలా అవసరం.