VZM: ఉత్తరాంధ్రలో రానున్న వారం రోజుల పాటు వడగాల్పులు వీచి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమతంగా ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సేదు మాధవన్ తెలిపారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోట, ఎక్కువ మంది కార్మికులు పని చేస్తున్న చోట నీడ, తాగునీరు ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఏవైనా సంఘటనలు జరిగితే కంట్రోల్ రూమ్ 08922 236947 తెలపాలన్నారు.