SKLM: పాతపట్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో గురువారం స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వేసవి కాలంలో కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.