NZB: ఆలూరు మండల కేంద్రంలో జనాభా గణన జరిగే విధానాన్ని ఇవాళ సెన్సస్ అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్ నరేందర్ ఆకస్మికంగా పరిశీలించారు. వివరాలను సరిగా నమోదు చేయాలని, ఒక్క ఇల్లు కూడా మిగిలిపోకూడదని, ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలని ఆదేశించారు. అన్ని వివరాలు అందజేయాలని, వివరాల గోప్యత ఉంటుందని ప్రజలకు సూచించారు. సూపర్వైజర్ రాజేష్, ఎన్యూమరేషన్ సిబ్బంది వేంకటేశ్వర్ ఉన్నారు.