W.G: విజయవాడలో నిర్వహించిన “నేషనల్ వర్క్ షాప్ ఆన్ స్కిల్లింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్” జాతీయ స్థాయి సదస్సులో తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి పాల్గొన్నారు. సమావేశంలో నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతలకు అనుగుణంగా కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కల్పించే దిశగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు.