KDP: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి కొనియాడారు. గురువారం వేంపల్లెలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశంలో ఎలక్ట్రానిక్, సమాచార విప్లవానికి ఆద్యుడు రాజీవ్ అన్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతిలో టెలిఫోన్ ఉందంటే, అందుకు ఆయన కృషే కారణమన్నారు.