VSP: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ వాల్తేరు డిపో వద్ద ఉద్యోగ సంఘాలు గేట్ మీటింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా రీజనల్ అధ్యక్షుడు ఏ.కె. శివాజీ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహిళలకు జీరో టికెట్ విధానాన్ని సులభతరం చేయాలని డిమాండ్ చేశారు.